ముదిగొండ మండల రైతులకి శుభవార్త.
మండల వ్యవసాయ శాఖ అధికారిని సరిత.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ముదిగొండ మండల పరిధిలో గల వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025- 26 కింద రైతులకు ఏ క్రింద తెలుపబడిన యంత్రాలు చిన్న, సన్నకారు రైతులకు అందించబడును అని మండల వ్యవసాయ అధికారిని తెలిపారు.
1 మ్యానువల్ స్ప్రేయర్లు -230
2 పవర్ స్ప్రేయర్లు – 32
3 పవర్ టిల్లర్లు -1
4 బ్రష్ కట్టర్లు -2
5 పవర్ ఫీడర్ -1
వీటికి గాను ఈ నెల 17వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ముదిగొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అప్లికేషన్లు స్వీకరించబడును. చిన్న సన్న కారు మరియు ఎస్సీ ఎస్టీ మరియు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ మీద ఇవ్వబడును దీనికి కావలసిన పత్రాలు
1 ఆధార్ కార్డు జిరాక్స్ – 3
2 పట్టాదారు పాస్ బుక్ – 3
3 రైతు పాస్ ఫోటోలు – 3
తీసుకొని రాగలరు అని ముదిగొండ మండల వ్యవసాయ అధికారిని సరిత తెలిపారు.









