*మైనార్టీ సమాజం బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలి*
*జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మండలానికి కొత్తగా చేసింది ఏమీ లేదని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన గుండాల మండలానికి అభివృద్ధిలో మాత్రం ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. బీసీ సమాజం ని మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నేనని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరచకుండా సాధ్యం కాదని తెలిసిన జీవో నెంబర్ 9 ని తీసుకువచ్చి బీసీలను మోసం చేసిందని అన్నారు. కోర్టులలో 42 శాతం రిజర్వేషన్ నిలవదు అని తెలిసినా కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిందని ఆయన నోటిఫికేషన్ రద్దయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సమాజం అండగా నిలిస్తే వారిని కూడా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుకొల్లూరి రాము, గడ్డం వీరన్న, నిట్ట రాములు, సయ్యద్ అజ్జు, తాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు









