మెదక్ హావేళ్ళి ఘణపూర్ నేటిగదర్ ప్రతినిధి అక్టోబర్ 17.
గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన మరియు ఎం.ఆర్.ఓ,కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా నాయకులు *మలిశెట్టి రవి మాదిగ* మాట్లాడుతూ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయి పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హావేళ్ళి ఘణపూర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ దాడి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి శిక్ష పడేలా చెయ్యాలి. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ హావేళ్ళి ఘణపూర్ మండలం అధ్యక్షులు మాద్గి సంజీవులు మాదిగ,ఎం.ఎస్.ఎపై.నాయకులు కందరం రాజు మాదిగ,రాజయ్య మాదిగ,వి.హెచ్.పి.ఎస్,అనుబంధ సంఘాల నాయకులు అర్క మాణిక్యం,మనే సాయిబాబా,జావాజి సిద్దిరాములు పాల్గొని దళితుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని తెలియజేస్తూ
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా నాయకులు మలిశెట్టి రవి మాదిగ,హావేళ్ళి ఘణపూర్ మండలం అధ్యక్షులు మాద్గి సంజీవులు మాదిగ,ఎం.ఎస్.ఎప్.నయకులు కందరం రాజు మాదిగ,వి.హెచ్.పి.ఎస్, నాయకులు అర్క మాణిక్యం మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు వి.హెచ్.పి.ఎస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.









