నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి
ఈ రోజు మీనవోలు గ్రామ పంచాయతీలో రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ల ఆధ్వర్యంలో ఓట్ల చోరీ జరుగుతున్న అంశం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఈ రానున్న ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లను చేర్చి గెలుపు కోసం బిజెపి ప్రయత్నిస్తుందని ప్రజలు జాగ్రత్తగా గమనించి తమ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకొని అపరిచితులు, సంబంధం లేని వ్యక్తులు నమోదు చేయించుకునే ఓట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని క మీనవోలు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ వేమిరెడ్డి అనురాధ, వెంకట్రావు అమ్మ మధుసూదన్ రెడ్డి, జమలయ్య, మనే స్వామి, సైదులు అమర్, సందీప్ రెడ్డి, ఫారుక్, ఖుర్షద్, అనిల్, నండ్రు బాబురావు, ఇస్మాయిల్, తతిరెడ్డి, పిల్లి వెంకటేశ్వర్లు, తదుపరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు









