+91 95819 05907

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం…

నేటి గదర్ న్యూస్ , ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు

బీసీ ప్రధానమంత్రి అని చెప్తూనే బీసీ రిజర్వేషన్ పై బిజెపి ప్రభుత్వం రాజకీయ కుట్ర…

బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్లో చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి…

తెలంగాణ అసెంబ్లీ 42 శాతం బీసీ రిజర్వేషన్ ఆమోదించిన బిల్లును గవర్నర్ అడ్డుకోవటం సిగ్గుచేటు…

రేపు 18న జరిగే బీసీ ఐక్య సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే బంద్ కు సిపిఎం సంపూర్ణ మద్దతు…

జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు

బీసీ రిజర్వేషన్ల పై ఈ రోజు జరుగుతున్నా చలో రాజ్‌భవన్‌ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఐ(ఎం) ఎర్రుపాలెం మండల కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రిజర్వేషన్లపై బిజెపి ఆడుతున్న నాటకానికి వ్యతిరేకంగా హై స్కూల్ నుంచి రింగ్ సెంటర్ వరకు ప్లే కార్డులతో ప్రదర్శన చేసి కేంద్ర దిష్టిబొమ్మను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు దివ్వేల వీరయ్య మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రం వెంటనే 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాలని, 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ ఆమోదిస్తూనే కేంద్రంలో మాత్రం అడ్డుకుంటుo దన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ సంతకం పెట్టకుండా అడ్డుకోవటం దుర్మార్గమైన సిగ్గు సేటు చర్యన్నారు.ఆ పార్టీ నాయకులు, ఎంఎల్‌ఏలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా బిసి ని ప్రధానమంత్రినీ చేసింది బిజెపి పార్టీ అని గొప్పలు చెప్పుకుంటూ బీసీ రిజర్వేషన్ పై రాజకీయ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు . రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు, రాష్ట్రపతికి పంపితే ఉద్దేశ్యపూర్వకంగానే ఎలాంటి ఉత్తర్వులు రాకుండా, బీసీలకు రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నటున్నది. దీని ఫలితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వాయిదాపడ్డాయన్నారు. కాబట్టి ఈబిల్లుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.పార్లమెంట్‌లో బిల్లును, రాష్ట్రంలో ఆర్డినెన్స్‌ను ఆమోదించకుండా అడ్డుకుంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈ నెల రేపు 18న జరిగే బీసీ జేఏసీ రాష్ట్రబంద్‌ జయప్రదానికి సీపీయం సంపూర్ణ మద్ధతునిస్తుందని తెలియజేశారు. బంద్ జయప్రదంకు పార్టీ శ్రేణులకు, బీసీ వర్గాలకు, సామాజిక శక్తులు, విద్యా సంస్థలు, వ్యాపారస్తులు, సహకరించి బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గామాసు జోగయ్య, నల్లమోతు హనుమంతరావు,షేక్ లాల, గొబ్బూరి కృష్ణంరాజు, బేతు శ్రీను, సగ్గుర్తి వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !