రైతులు కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా,లాగిన్ అయ్యి స్లాట్ బుక్ చేసుకోవాలి- ఎస్ విజయ్ చంద్రం
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మండల పరిధిలో స్థానిక నరసింహపురం గ్రామంలో శనివారం మధిర వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్రం సందర్శించినారు, ఈ సందర్భంగా విజయ్ చంద్రం మాట్లాడుతూ పత్తి పంట వేసుకున్న రైతులు కాపాస్ కిసాన్ అనే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యే స్లాట్ బుక్ చేసుకోవాలని రైతులకు సూచించినారు.మరియు పత్తి పంట వేసుకున్న రైతులందరూ మీ యొక్క సంబంధిత ఏఈవోలు దగ్గరికి వెళ్లి పంట నమోదు వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నెంబర్ సరిగా ఉందో లేదు సరి చేసుకోవాలని సూచించినారు. మొబైల్ నెంబరు సరిగ్గా లేకపోతే పత్తి సీసీఐ లో అమ్ముకోవడం కుదరదు కాబట్టి పత్తి రైతులందరూ మీ మీ కస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి మొబైల్ నెంబర్ సరిచేసుకోవాలని వివరించినారు సూచించినారు . ఈ కార్యక్రమంలో చింతకాని మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస. ఏఈఓ తేజ. కళ్యాణి. మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.









