దశదినకర్మలకు రూ. 6100 ఆర్థిక సహాయం అందజేత.
నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని తాటిగూడెం గ్రామంలో ఆదివాసీ కుటుంబం కొమరం నాగేశ్వరావు ఇటివల మరణించినారని అందరికీ తెలిసిన విషయమే అతడికి భార్య ముగ్గురు ఆడపిల్లలు అని తెలిసి చలించిపోయిన వెంకటాపురం గ్రామం ఆదివాసీ యువకులు అందరు కలిసి చందాలు వేసుకొని వారు 6100/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ కుటుంబంకు అందించి కుటుంబానికి అండగా నిలిచారు. వీరి సహృదయాన్ని చూసి ఆ గ్రామ పెద్దలు అభినందించారు ఇకముందు కూడా ఇలాంటి అవాంఛనీయఘటన జరిగినచో ప్రతి ఆదివాసీ యువత ముందుండాలని ఈ సందర్బంగా గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం యువకుడు కొమరం రవి తాటిగూడెం గ్రామ పెద్దమనిషి పోలెబోయిన రామారావు, పోలెబోయిన వెంకటనారాయణ, చందా ప్రదీప్, పూనెం లక్ష్మణ్, కొమరం వరుణ్, కొమరం ప్రశాంత్, కొమరం ప్రవీణ్, సోలం క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.









