+91 95819 05907

పేద విద్యార్థుల విద్యకు వేమూరి సత్యనారాయణ చేయూత.

కొత్తపల్లి ధనూష్ కుమార్ కు 70 వేల ల్యాప్ టాప్ అందజేత

పదవ తరగతి విద్యార్థులకు ఆర్థిక సహాకారం.

నేటి గదర్ న్యూస్, వైరా:
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వేమూరి సత్యనారాయణ గత పది సంవత్సరాలుగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. వైరా మండలం సిరిపురం (కెజి) గ్రామం వాస్తవ్యులు, వైరా పట్టణ నివాసి రిటైర్డ్ అధ్యాపకులు వేమూరి సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఎంబిబిఎస్, బిటేక్ చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తూ ఒకవైపు ప్రభుత్వ విద్యకు చేయూత అందిస్తూ, మరోవైపు ఉన్నత విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నారు. మంగళవారం సిరిపురం (కెజి) జెడ్.పి.హెచ్ఎస్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ అధ్యాపకులు వేమూరి సత్యనారాయణ, స్వరూపారాణి దంపతుల కుమారుడు ప్రముఖ ఎన్ఆర్ఐ వేమూరి సుధీర్ సౌజన్యంతో సిరిపురం(కెజి) గ్రామానికి చెందిన బిటేక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థి కొత్తపల్లి ధనూష్ కుమార్ కు 70 వేల రూపాయలు విలువ చేసే డెల్ కంపెనీ ల్యాప్ టాప్ అందజేశారు. జడ్.పి.హెచ్.ఎస్ సిరిపురం(కేజీ)లో 10వ తరగతి చదువుతున్న 20 మంది పేద విద్యార్థుల విద్యా అవసరాలకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ జీవితాన్ని మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉందని, ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని, శ్రద్ధగా, క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం వేమూరు సత్యనారాయణను, ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాత వేమూరి సత్యనారాయణ, మార్పు స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, సోషల్ వర్కర్ షేక్ లతీఫ్, ఉపాధ్యాయులు సూర్యదేవర సురేష్, మూడు వసురామ్, విద్యార్థి కొత్తపల్లి ధనూష్ కుమార్ తల్లి కొత్తపల్లి సీత, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !