చేగుంట వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో నిర్వహణ.
విద్యార్థులకు వివరించిన పోలీస్ శాఖ అధికారులు.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) అక్టోబర్ 22.
మెదక్ జిల్లా లో బుధవారం నాడు చేగుంట మరియు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థుల కోసం “ఓపెన్ హౌస్” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పలు అంశాలు పోలీసులు విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, పని విధానాలు, పోలీస్ రికార్డుల నిర్వహణ గురించి వివరంగా తెలియజేశారు.అలాగే పోలీస్ శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోం గార్డ్‌ల బాధ్యతలు, కర్తవ్యాలు ఎలా ఉంటాయో విద్యార్థులకు వివరించారు. నేరాల రకాలు, వాటి దర్యాప్తు విధానం, పోలీస్ స్టేషన్‌లో జరిగే పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పోలీస్ విధులు, నేరాల నిరోధం, ప్రజల భద్రత కోసం పోలీసులు చేసే సేవల గురించి అవగాహన పొందారు.
ఈ కార్యక్రమంలో వెల్దుర్తి చేగుంట , పోలీస్ సిబ్బంది, మరియు జడ్.పి.హెచ్.ఎస్ చేగుంట వెల్దుర్తి విద్యార్థులు,ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.









