సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ :
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలంలో సాగుచేసిన పంటలైన పెసర,మినుము ప్రత్తి, వరి పంటలు గత నెల రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని పంట నష్టం జరిగిన ప్రతి పంటకు ప్రతి ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
వైరా సిపిఎం ఆఫీస్ బోడెపుడి భవనం నందు వైరా రూరల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్యుల సమావేశం సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగింది ఈ సమావేశంలో భూక్యా వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ మండలంలో రైతులు వేసిన పంటలు పెసర మినుము పంటలో వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని అదేవిధంగా ప్రతి పంటకు వైరస్ కి ప్రతి దిగుబడులు రాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అరకొరగా వచ్చిన ప్రతి ఇప్పుడు దేశ తీసే దశలో ఉందని గత నెలలో నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రతి పంటకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బావు లు, బొర్ల కింద వేసిన వరి పంట కోత దశలోకి వచ్చిందని వర్షాలకు వరి పంట కూడా నష్టం జరిగింది అని అన్నారు. దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దెబ్బతిన్న పంటలకు నష్ట పరివారం వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వని పక్షంలో రైతులను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్,సిపిఎం వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు,మండల కమిటీ సభ్యులు సుధాకర్, కిలారి శ్రీనివాసరావు మేడా షరాబంది, బాజోజు రమణ తదితరులు పాల్గొన్నారు









