+91 95819 05907

నాన్న ఎందుకో వెనకపడ్డాడు!!!!

*”నాన్న ఎందుకో వెనకపడ్డాడు”*

అమ్మ తొమ్మిది నెలలు మోస్తే…
నాన్న జీవితాంతం మోస్తాడు…
రెండూ సమానమే అయినా
నాన్నెందుకో వెనకబడ్డాడు.

ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ…
సంపాదన అంతా ఇంటికే పెడుతూ నాన్న…
ఇద్దరి శ్రమా సమానమే అయినా
అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు.

ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ…
ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న…
ఇద్దరి ప్రేమా సమానమే అయినా
అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు.

ఫోనులోనూ అమ్మ అనే పేరే
దెబ్బ తగిలినప్పుడూ అమ్మా అనే పిలుపే…
అవసరం వచ్చినప్పుడు తప్ప
మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా?అంటే..ఏమో!
ఇద్దరూ సమానమే అయినా
పిల్లల ప్రేమ పొందడం లో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు.

అమ్మకు, మాకు బీరువా నిండా
రంగురంగుల బట్టలు…
నాన్న బట్టలకు దండెం కూడా నిండదు…
తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాక్కూడా పట్టనంత వెనకబడ్డాడు.

అమ్మకు ఎన్నో కొన్ని బంగారు నగలు…
నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచె ఒక్కటే…
కుటుంబం కోసం ఎంత చేసినా
తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు.

పిల్లల ఫీజులు ఖర్చులున్నాయ్ అన్నప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దని అమ్మ…
ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులుతో ఇష్టంగా తినే నాన్న…
ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా
అమ్మకంటే నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు.

వయసు మళ్ళాకా అమ్మైతే ఇంట్లో పనికి పని కొస్తుంది…అదే నాన్నైతే ఎందుకూ పనికిరాడని తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే!
నాన్న ఇలా వెనకబడి పోవడానికి కారణం

*నాన్నంటే కుటుంబానికి వెన్నుముక* కావడమే!
అంత ప్రేమను పంచే నాన్నను ప్రేమగా చూసుకొందాం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !