హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ నేటి గదర్ అక్టోబర్ 23.
మెదక్ జిల్లా హావేళ్ళి ఘణపూర్ మండలం లోని శమ్నాపూర్ గ్రామంలో కులం పేరుతో దూషించి , తిట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపాలాని , ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు అస్రగల్ల బాల్ రాజు మాదిగ అన్నారు.హవేలీ ఘన్పూర్ మండలం శామ్నాపూర్ గ్రామంలో గత సంవత్సరం మొదలుకుంటే ఈ సంవత్సరం వరకు దళితుల మీద వివక్షగాని కక్ష సాధింపుగా జరుగుతున్న దాడులను ఎక్కడ కూడా నియంత్రలించకపోతున్నారని బాల్రాజ్ అన్నారు. శామ్నాపూర్ గ్రామంలో ఉంటున్న కోమ్మట సిద్ధిరాములు , సిద్ది రాములు భార్యపై ఈ నెల 12న కులం పేరుతో ఇద్దరి మీద అగ్రవర్గాలు దూషించి , భౌతికంగా దాడి చేసే ప్రయత్నం చేశారని , సిద్ధి రాములు కుటుంబం పై పదేపదే ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని , జిల్లా యంత్రాంగాన్ని దీని పైన దృష్టి సారించి అగ్రవర్గాలు మాదిగల పై జరుగుతున్న దాడులను ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి అనేది స్పష్టంగా తెలియాల్సి ఉందని అన్నారు. ఫిర్యాదుదారులు స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేరని అన్నారు. అదే కాకుండా ఎవరైతే ఫిర్యాదు చేశారో వారిపై నే మళ్ళి అక్రమంగా కేసులు పేడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసు ఎఫ్ఐఆర్ చేసి తక్షణమే కులం పేరుతో దుషించిన బద్దం యాదవరెడ్డి పై యస్.యస్.టి అట్రాసిటీ కేసు నమెదు చేసి అతనిని రిమాండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు అస్రగల్ల బాల్ రాజు డిమాండ్ చేశారు.









