+91 95819 05907

గ్రూప్ వన్ విజేత డి.ఎస్.పి లక్ష్మీ సాహితీకి వేద పండితుల ఆశీర్వాదం.

డీఎస్పీ నియామక పత్రం అందుకున్న లక్ష్మీ సాహితి

ఘనంగా సన్మానించిన డాక్టర్ కాప మురళీకృష్ణ లయన్స్ క్లబ్ సభ్యులు.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంగేపు లక్ష్మీసాహితి డీఎస్పీగా నియామకమయ్యారు.లక్ష్మీ సాహితి ఇటీవల రాష్ట్ర డిఎస్పీ నియామక పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా వైరాలోని శ్రీ సత్యసాయి వేద పాఠశాల నందు వైరా లయన్స్ క్లబ్ మరియు గ్రేట్ విజన్ క్లబ్బుల ఆధ్వర్యంలో ఘన సత్కారం ఏర్పాటు చేశారు.వేద పాఠశాల పండితులు దుర్భాకుల కుమారశర్మ అవధాని వేద మంత్రోచ్ఛరణతో సాహితీని ఆశీర్వదించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి ముందుకెళ్లాలని దీవించారు అనంతరం వైరా లయన్స్ క్లబ్బుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీసాహితీని గురువారం ఫాస్ట్ జిల్లా గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ లయన్స్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి లక్ష్మీసాహితి అంచలంచెలుగా ఎదిగి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డీఎస్పీగా నియామకం కావడం గొప్ప విషయం అన్నారు ప్రణాళిక బద్ధంగా చదివి తన తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి విద్యార్థి లోకానికి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు తల్లిదండ్రులు చదివించడానికి ఆర్థిక వ్యయ ప్రయాసాలుఓర్చి కూతురు అభిరుచి మేరకు విద్యను అందించారని అన్నారు. పట్టుదల అంకితభావంతో కృషి చేయడం తో సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదనిసాహితినిరూపించిందని 14 గంటలు చదువుపై దృష్టి సారించి గ్రూప్ వన్ ర్యాంకు సాధించటంఅభినందనీయమన్నారు అనంతరం డిఎస్పీ లక్ష్మీ సాహితి మాట్లాడుతూ తాను పోటీ పరీక్షల్లో నెగ్గటానికి అమ్మానాన్నల కృషి వెన్ను దన్నుగా నిలవడం వల్లనే గ్రూప్ వన్ విజయం సాధించడానికి స్టేట్ సిలబస్ అయినా సిబిఎస్ సిలబస్ అయినా విజయ ప్రస్తానానికి దోహద పడిందన్నారు తాను ఏడో తరగతి వరకు వైరా మధు విద్యాలయంలో ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి వరకు ఖమ్మం వీడిఓస్ కాలనీలో రేజోనేన్స్ ఇన్ఫో స్కూల్ ఇంటర్ ఖమ్మం నందు డిగ్రీని హైదరాబాదులో ఇంటిగ్రేటెడ్ కళాశాలలో ఎంఏ ను సోషయాలజీని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశానని తెలిపారు డిగ్రీ నుంచే తాను పోటీ పరీక్షల పై అవగాహనతో చదివానని గ్రూప్ వన్ పోటీ పరీక్షలు డి.ఎస్.పి గా నియామకం పొందినని తెలిపారు. భవిష్యత్తులో సివిల్స్ టార్గెట్ గా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను అని లక్ష్మీ సాహితి తెలిపారు ఈ సన్మాన కార్యక్రమం లో జిల్లా మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రావు జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు వైరా క్లబ్ అధ్యక్షులు వై బుచ్చి రామారావు గ్రేట్ విజన్ క్లబ్, సెక్రటరీ వైరా క్లబ్ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరావు, గంగవరపు కిషన్, కోశాధికారి ఉయ్యూరి రామకృష్ణ,వైస్ ప్రెసిడెంట్ ఏపూరి రాజారావు, కన్యదారి హనుమయమ్మ చింతోజు సీత ,దుర్భాకుల రాధిక, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !