ఉపాధి హామీ వర్కర్లకు పనిముట్లు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 24: అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ శనివారం అశ్వారావుపేట మండల కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ముఖ్య కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అవసరమైన పనిముట్లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వయంగా పంపిణీ చేస్తారు. అనంతరం మండల పరిధిలో కొనసాగుతున్న మరియు కొత్తగా చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ వట్టి వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.









