*వాహన తనిఖీలు చేపట్టిన సీఐ ఎల్ .రవీందర్, ఎస్సై సైద రహూఫ్*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*; మావోయిస్టు పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలంలో పోలీసులు తనిఖీలను చేపట్టారు. గుండాల సీఐ ఎల్. రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ ముమ్మర తనిఖీలను చేపట్టి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ మావోయిస్టుల బంద్ నేపథ్యంలో రోళ్లగడ్డ గ్రామ సమీపంలో వాహన తనిఖీ చేపట్టామని ఆయన అన్నారు. బందు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందస్తు చర్యలలో భాగంగా తనిఖీలను చేశామని ఆయన పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని ఆయన పేర్కొన్నారు. ఆసాంఘిక శక్తులకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
Post Views: 77









