*తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో తలపెట్టిన ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య కోరారు. శుక్రవారం మండలం పరిధిలోని పగిడిద్దరాజు గద్దెల వద్ద తుడుం దెబ్బ సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ మూడో తారీఖున ఏటూర్ నాగారం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదివాసి సమాజాన్ని ఆయన కోరారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించేంతవరకు ఉద్యమం తప్పదని ఆయన అన్నారు. 1976 సంవత్సరంలో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చినప్పటి నుండి రాష్ట్రానికి వలస వచ్చిన లంబాడాలు రిజర్వేషన్ అనుభవిస్తూ రాజకీయంగా, ఉద్యోగ పరంగా ఎస్టి కోటాని పొందుతూ ఆదివాసీలకు గండి కొడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆదివాసి సమాజం ఉద్యమాన్ని ఉధృతం చేసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వజ్జ ఎర్రయ్య, మోకాళ్ళ కన్నయ్య, ఇనుముడి నాగేశ్వరరావు, సాంబయ్య, గోవింద నరసింహారావు, నారాయణ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు









