+91 95819 05907

దమ్మపేట నాసిరకం సెంట్రల్ లైటింగ్ పనులు● గుంతల రోడ్లపై బీఆర్ఎస్ ఆగ్రహం ◆ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

దమ్మపేట నాసిరకం సెంట్రల్ లైటింగ్ పనులు, గుంతల రోడ్లపై బీఆర్ఎస్ ఆగ్రహం; కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ అనంతరం రోడ్లు, సెంట్రల్ లైటింగ్ స్థంభాన్ని పరిశీలించిన నాయకులు.
అవినీతిలో కూరుకుపోయిన గ్రామాలు, స్థానిక ఎన్నికల కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య.
వెంటనే సెంట్రల్ లైటింగ్ పనుల పర్యవేక్షణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్.

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 25: కేంద్ర బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సూచనలతో శనివారం దమ్మపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు దమ్మపేట జయలక్షి టాకీస్ వద్ద చిన్నపాటి తాకిడికి పడిపోయిన సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని పరిశీలించారు. అదే మార్గంలో ఉన్న గుంతల వద్ద గుంతలతో సెల్ఫీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్న గ్రామాలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతిలో కూరుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుదామా అని గ్రామాల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దమ్మపేట మండల కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే మంచి ఆలోచనతో ఆనాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి రూ.5 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు మంజూరు చేయించి, పనులను 2023లో ప్రారంభించారని గుర్తుచేశారు. కానీ ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకపు పనులు చేస్తూ ప్రజా ధనాన్ని వృధా చేస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పడి ఏడవడమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. వర్షాకాలంలో సహజంగా తారు రోడ్లపై గుంతలు పడతాయని, వాటిని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదైనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ స్థానికంగా ఉండే ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వెంటనే సెంట్రల్ లైటింగ్ పనులను అధికారులు పర్యవేక్షిస్తూ, ప్రజా ధనాన్ని వృధా అవకుండా కాపాడాలని అలాగే గుంతలు పడ్డ రోడ్లపై మరమ్మతులు వెంటనే చెయ్యాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరావు, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జున రావు, నియోజకవర్గ నాయకులు సోయ్యం వీరభద్రం, మండల నాయకులు అంకత ఉమ మహేశ్వరావు, జలగం వాసు, ఉప సర్పంచ్ దారా యుగుందర్, నాయకపోడు సంఘం జిల్లా సభ్యులు రావుల శ్రీనివాసరావు, తుమ్మల లక్ష్మనరావు, మండల ఉపాధ్యక్షులు గాజుబోయిన ఏసుబాబు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు, యూత్ మండల అధ్యక్షులు మండవ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు దేవరపల్లి అజయ్ కుమార్, కాసిని శ్రీను, మాజీ సర్పంచ్ ఉయ్యాల చిన వెంకటేశ్వరావు, రెడ్డిమళ్ళ నాగయ్య, అబ్దుల్ జిన్న, పాకనాటి శ్రీనివాసరావు, మద్దెల పుల్లారావు, పాస్యం ప్రసాద్, బీసీ మండల నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు, శ్రీరాముల చక్రదరావు, మొగిలి కృష్ణ, గాజుబోయిన శ్రీనివాసరావు (ఆటో యూనియన్ కార్యదర్శి), మహేష్, కో ఆప్షన్ ఎంపీటీసీ బుడే, వాడపల్లి నాని, కొలికపోగు నాగరాజు, కొండా సాయి, గుర్రెపటి చిన్ని, శేషాద్రి, కొయ్యల రాజు, గాజుబోయిన రాంబాబు, అడపా కృష్ణయ్య, బేక్కం వెంకటేశ్వరావు, రూప రాంబాబు, రొయ్యల శ్రీను, నునవత్ రాంబాబు, నందికుల చిన బాబు, ఆడబెల్లి సుబ్బారావు, కొల్లి శేఖర్, మడిపల్లి పోలరావు, బత్తుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !