నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మధిర నియోజకవర్గం BRS పార్టీ ఇంచార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ 55 పుట్టినరోజు సందర్భంగా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు,చింతకాని మండల పార్టీ, యువజన విభాగం ఆధ్వర్యంలో నాగులవంచ గ్రామంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొని 55 మంది రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ వైస్ MPP గురిజాల హనుమంతరావు, రైతు నాయకులు మంకెన రమేష్, గడ్డం శ్రీను,కొండలు,కొల్లి బాబు, ఛాట్ల సురేష్, చాట్ల భగవాన్, యువజన విభాగం నాయకులు కొపూరి నవీన్, అయ్యోరీ సాయి,మీరా సాహెబ్, పర్శగని ఏడుకొండలు,నాదెండ్ల వెంకటేష్, శీలం నాగేశ్వరావు తదితర చింతకాని మండల BRS పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .









