నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు.
ఎన్టీఆర్ సర్కిల్ (బడిదగ్గర రోడ్) నుండి సైదేల్లిపురం(మర్లపాడు) బీటీ రోడ్డు కు సుమారు 6 కోట్ల 75లక్షల రూపాయలు మరియు అంకమ్మ గుడి సెంటర్ నుండి సైదేల్లిపురం(మర్లపాడు) బిటి రోడ్ 3 కోట్ల 75 లక్షలు
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ నుంచి నిధులను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు ఆర్థిక విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి కృషితో మంజూరు చేసినందుకు తల్లపరెడ్డి రత్నారెడ్డి PACS ఉపాధక్షులు, ఇనగాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి బీటీ రోడ్డును మంజూరు చేసినందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ రైతులు, గ్రామ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కి గ్రామ ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినారు.









