+91 95819 05907

రవాణా సౌకర్యం, కూలీల సంక్షేమానికి పెద్దపీట -అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె

వేలేరుపాడుకు కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం; కూలీలకు ఆధునిక పనిముట్లు అందజేత

చదరంగం క్రీడాకారిణి భవ్యశ్రీకి సాయం, గుమ్మడవల్లి కొత్తూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముందుగా ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త పనిముట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు తక్కువ కష్టంతో ఎక్కువ పని చేయగలిగేలా ఈ పనిముట్లు ఉపయోగపడతాయని తెలిపారు. కూలీల కష్టానికి విలువ ఇవ్వడం, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధిలో ఉపాధి కూలీల పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం అశ్వారావుపేట బస్టాండ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలేరుపాడు మండల కేంద్రానికి నూతన బస్సు సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్న చోట ఇలాంటి సర్వీసులను మరిన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం తర్వాత ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే కొంతదూరం ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో కేశిబోయిన వీరాంజనేయులు, రమాదేవి దంపతుల కుమార్తె భవ్యశ్రీ చదరంగంలో జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. భవ్యశ్రీని మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చివరగా గుమ్మడవల్లి కొత్తూరు గ్రామంలో ఇటీవల ఐటీడీఏ పరిధిలో అశ్వారావుపేట నియోజకవర్గానికి అదనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ యాజమాన్యం ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !