* *ఎన్నో కేసులను సుమోటో గా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు , న్యాయవ్యవస్థకు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి కనిపించడం లేదా..?*
*విశ్వాసాలు, ధర్మాల పేరుతో దాడులు చేస్తే వారికి చట్టాలు వర్తించవా..?*
*సిజే పై జరిగిన దాడికి నిరసనగా నవంబర్ 1న హైదరాబాద్ లో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ*
* *ఈ ర్యాలీకి ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు అలాగే న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని నిలబెట్టడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కోసం కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి*
– *ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.*
నేటి గదర్ సిద్దిపేట న్యూస్ (భూపాల్ మాదిగ) అక్టోబర్ 28.
దేశ రాజధానిలో, అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఇంకా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు ? ఎన్నో కేసులను సుమోటో గా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు , న్యాయవ్యవస్థకు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి కనిపించడం లేదా..? అనేక విషయాల మీద స్పందించే మానవ హక్కుల కమిషన్ కు మౌనం ఎందుకు..? కోర్టులో దాడి జరిగినా కంటెంట్ ఆఫ్ కోర్టు, కోర్టు ధిక్కరణ కింద శిక్షలు ఎందుకు పడవని అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు.
సిద్దిపేట ప్రెస్ క్లబ్ మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ” సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు. ఈ దాడి జరిగి నేటికి 20 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. జస్టిస్ గవాయ్ గారి స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా? తను దళితుడు కాబట్టే స్పందించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.
హర్యానాలో ఒక లాయర్ జడ్జికి వాగ్వివాదం జరిగితే జడ్జిని అమర్యాదగా మాట్లాడినందుకే అతనిపై సుమోటో కేసు పెట్టి చర్యలు తీసుకుంటున్నప్పుడు, ఇక్కడ సీజే మీద బూటుతో దాడుచేసిన కూడా కేసులు, అరెస్టులు లేవని గుర్తుచేశారు. దేశ ప్రధాని నుంచి మొదలుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్ర నేతలు, దేశవ్యాప్తంగా దాడి ఘటనను ఖండించారని, ఈ ఘటన అనాగరికమైనది ఐనా అరెస్టులు, చట్టపరమైన కేసులు లేవని, దీనికి కారణం CJ దళితుడు కావడమేనని ఆయన మండిపడ్డారు. దాడిని ఖండించిన వాళ్లు కండన వరకే పరిమితమై అరెస్టుకు, కేసులు పెట్టాలని డిమాండ్ చేయకపోవడం ఆంతర్యం ఏమిటని ? ఈ ద్వంద్వ విధానాలతో దళితుల అస్తిత్వము ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదని అన్నారు. విశ్వాసాలు, ధర్మాల పేరుతో దాడులకు దిగితే చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు.అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు. దళితులు ఎంత ఉన్నత స్థానానికి కష్టపడి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతుందని అన్నారు. అందుకే గవాయి పై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని అన్నారు. గవాయ్ పైన జరిగిన దాడి వల్ల దేశంలో ఉన్న దళితుల హృదయాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని అన్నారు.కానీ 20 రోజులుగా ఎదురు చూస్తున్నా నేటికీ న్యాయం జరగలేదని అన్నారు. కనుకనే ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు.తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేయాలి. నిందితుడిని అరెస్టు చేసి జైలులో పెట్టాలి.అలాగే ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ చేత విచారణ జరిపించి దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాలి.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని అన్నారు. చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 1న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని , ఈ ర్యాలీలో ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు అలాగే న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని నిలబెట్టడం కోసం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కోసం కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 1న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి సెక్రటేరియట్ పక్కకు ఉన్న గల పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన మహా ర్యాలీ జరుగుతుందని, ఈ ర్యాలీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలిరావాలని కోరారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు మాదిగ , ఎంఎస్పి జిల్లా కో ఇన్చార్జి మల్లిగారి యాదగిరి మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి కనకరాజు, ఎం ఈ ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సామ్రాట్ ప్రకాష్ ఎమ్మెస్ పి రాష్ట్ర నాయకులు మైసా రాములు, ఎం ఎస్ పి సిద్దిపేట జిల్లా సీనియర్ నాయకులు పేర్కా పరశురాములు, చుంచు రమేష్ జేరిపోతుల లక్ష్మణ్,సనవల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఉబ్బనీ ఆంజనేయులు , ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బింగి పవన్ కళ్యాణ, ఎం ఎస్ పి జిల్లా సీనియర్ నాయకులు , చింతకింది పరశురాములు, ఎంఎస్పి చేర్యాల డివిజన్ ఇంచార్జి గడిపి బాల నర్సయ్య, గజ్వేల్ నియోజకవర్గం ఎంఎస్పీ ఇన్చార్జ్ గడ్డం వెంకటేష్ , ఎమ్మార్పీఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు వడ్లూరి పరశురాములు, దుబ్బాక మండలం అధ్యక్షులు దొమ్మాట జోగయ్య జంగిటి యాదగిరి చేర్యాల మండల కోఆర్డినేటర్, హరీష్ , మంకాల బాలయ్య భూమయ్య రమేష్ రాజు నందు పాల్గొన్నారు.









