+91 95819 05907

వర్థిల్లు వెయ్యేళ్లు…. జీవించు నూరేళ్లు…!

– ఊరువాడ పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలు.

– బైక్ ర్యాలీలతో హోరెత్తిన ఉమ్మడి ఖమ్మంజిల్లా.

– రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ

– వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఖమ్మం ఎంపీ ఆర్ఆర్ఆర్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం : వర్థిల్లు వెయ్యేళ్లు…. జీవించు నూరేళ్లు…. తరించే నీవాళ్లు… స్మరిస్తూ అయినోళ్లు … నేలతల్లి గొంతుఎత్తి పల్లెలన్నీ పళవించి తెలిపినాయి నీకూ ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే అంటూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ఊరువాడ తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలను మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. పొంగులేటి అభిమానులు బైక్ ర్యాలీలతో ఉమ్మడి ఖమ్మంజిల్లాను హెూరెత్తించారు. పురవీధులన్నీ శీనన్న కటౌట్లు, ప్లెక్సీలు, భారీ హెర్డింగ్ లతో నిండిపోయాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ప్రతీ పల్లెల్లో శీనన్న పుట్టిన రోజు వేడుకల కోలాహలమే కనిపించింది. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొంగులేటి శీనన్న పిలుపు మేరకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలంతా సమాజ, సామాజిక కార్యక్రమాల్లోనే నిమగ్నమయ్యారు.

– ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో….
మంత్రి పొంగులేటి ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో పుట్టినరోజు సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి హాజరై కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

– ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా….
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శీనన్న పుట్టిన రోజు సంబురాలను కోలాహలంగా నిర్వహించారు. వరంగల్ క్రాస్ రోడ్డులో వెంపటి రవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. మెఫీ మానసిక వికలాంగుల కేంద్రంలో భూక్య సురేష్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. నేలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుమలాయపాలెం మండలంలో బెల్లం శ్రీను ఆధ్వర్యంలో శీనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముదిగొండ మెయిన్ సెంటర్ లో దేవరపల్లి అనంత రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎం.వి. పాలెంలో మందపల్లి నాగమణి ఆధ్వర్యంలో శీనన్న జన్మదిన వేడుకలను నిర్వహించారు. గ్రెయిన్ మార్కెట్ ఏరియాలో భీమనాథుల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో, ఖమ్మం ఖానాపురంలో ని శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అయ్యప్పస్వాములకు డీసీసీ నాయకులు గుర్రాల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాల్వఒడ్డులో అన్న క్యాంటీన్ లో మద్ది కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 60వ డివిజన్ కార్పొరేటర్ బద్దె నిరంజన్ ఆధ్వర్యంలో రామన్నపేటలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఖమ్మం నగరంలో పారా ఉదయ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, బాణాసంచాలను కాల్చారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథబాబు ఆధ్వర్యంలో వెంకటగిరిలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో ఉడుముల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, బైక్ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. సింగరేణి మండలంలో జరిగిన శీనన్న జన్మదిన వేడుకల్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఇంకా అనేక ప్రాంతాల్లో శీనన్న జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !