+91 95819 05907

స్వగ్రామం చేగొమ్మలో పర్యటించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

* గ్రామస్తుల యోగ క్షేమాలు తెలుసుకుని.. పాఠశాల భవనం పరిశీలన
* సాదర స్వాగతం పలికిన.. సొంతూరు ప్రజలు
* అండగా ఉంటానని అభయమిచ్చిన రామ సహాయం

కూసుమంచి: తన స్వగ్రామమైన చేగొమ్మకు వెళ్లి.. గ్రామ పెద్దలు, వృద్ధులను పలకరించి..ఊరి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని.. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి నేనున్నానంటూ భరోసా నింపారు. సొంతూరి పర్యటనకు వచ్చిన ఎంపీకి గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ” పెద్దాయన ఎలా ఉన్నావ్..? ఆరోగ్యం బాగుంటుందా..?” అంటూ పెద్దలతో మాట్లాడి, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. తొలుత కాంగ్రెస్ నాయకులు బొలికొండ శ్రీను తండ్రి బొలికొండ వెంకన్న ఇటీవల చనిపోగా.. వారి నివాసానికి వెళ్లి వెంకన్న చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన తమ భవనం పరిశీలన.
చేగొమ్మ గ్రామంలో.. దశాబ్దాల కిందట ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్వగృహాన్ని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరిశీలించారు. తరగతి గదులను, నిరుపయోగంగా ఉన్న పై అంతస్తును పరిశీలించి.. అవసరమైన మరమ్మతులు చేయిస్తానని అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ రావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు కొండపర్తి సురేష్, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !