కొత్తగూడెం లీగల్ :: పోక్సో కేసులో వ్యక్తికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ( ఫోక్సో స్పెషల్ జడ్జ్. అదనపు ఛార్జ్)ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు
మణుగూరు మండలం, వాగు మల్లారం కు చెందిన యువతి తన ఫిర్యాదులో మైనర్ అమ్మాయినీ మణుగూరు మండలం జానం పేట కు చెందిన గాడిద.శ్రీనివాస్ పై 2024 /06/12వ తేదీన ఆగాయిత్యం చేయగా వారు మణుగూరు పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్ సతీష్ కేసు నమోదు చేసుకోగ, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ బి.రవీందర్ రెడ్డి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు…..
కోర్టులో 11 మంది సాక్షులను విచారించారు. శ్రీనివాస్ పై నేరం రుజువు కాగా 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, పదివేల రూపాయల జరిమానావిధించారు తను జరిమానా చెల్లించనీ యెడల ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య ,లైజాన్ ఆఫీసర్ సయ్యద్ అబ్దుల్ ఘని (కోర్టు డ్యూటీ ఆఫీసర్) అశోక్ లు సహకరించారు.









