*ఉప్పొంగుతున్నా పాతర్లపాడు – నాగులవంచ మధ్య బండిరేవు వాగు*
*రవాణా నిలిపి వేసిన చింతకాని పోలీస్ శాఖ*
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
మొంథా తుపాను ప్రభావంతో చింతకాని మండల వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావానికి నాగులవంచ- పాతర్లపాడు మధ్య ఉన్న బండి రేపు వాగు రహదారిపై రెండు అడుగుల మేర పొంగి ప్రవహిస్తోంది. దీంతో పోలీస్ సిబ్బంది గ్రామపంచాయతీ ట్రాక్టర్ను అడ్డు పెట్టి రాకపోకలను ఆ మార్గంలో నిలిపి వేశారు. చిన్న మండవ సమీపంలోని మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వీరేందర్ సూచించారు.
Post Views: 68









