గండుగులపల్లిలో క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత శిబిరం
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో బసవతారకం హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు -అక్టోబర్ 30న క్యాంపు, నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 29: నియోజకవర్గ ప్రజల కోసం శుభవార్త. స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాన్ని గండుగులపల్లి గ్రామంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్ వారి సహకారంతో నిర్వహించనున్నారు.
ముఖ్య వివరాలు: తేదీ: 30/10/2025 గురువారం సమయం: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామం
తప్పనిసరిగా హాజరు కావలసినవారు 30 ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు లేదా మద్యం సేవించే అలవాటు ఉన్నవారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వ్యక్తులు, శరీరంలో క్యాన్సర్ లక్షణాలుగా అనుమానం ఉన్నవారు
నియోజకవర్గ ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ వట్టి వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.









