గాయత్రి కళాశాల విద్యార్థుల ఎన్ ఎస్ ఎస్ శిబిరం.
నాలుగవ రోజు కొనసాగిన ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ సునీల్.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
గాయత్రీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో చింతకాని మండల పరిధిలోని రఘవాపురం గ్రామం నందు నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా రఘువాపురం గ్రామానికి చెందిన వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బస్ స్టాప్ ను విద్యార్థులు శుభ్రం చేశారు. ఈ స్టాప్ వద్ద వందనం, బస్వాపురం, లచుగూడెం గ్రామాలకు వెళ్లే దారుల్లో కేంద్రంగా ఉండటం గమనార్హం.ఈ సందర్భంగా పీఓ జయప్రద మాట్లాడుతూ వాలంటీర్స్ చాలా చురుకుగా పనిచేస్తున్నారని, గ్రామములో ఇంకా ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి వాలంటీర్స్ ను టీమ్ లుగా చేసి సర్వే నిర్వహించడం కోసం అన్ని అంశాల పట్ల అవగాహన కలిగించే విధంగా ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కొండపర్తి గోవిందరావు, కళాశాల ప్రిన్సిపాల్ కుతుంబాక సునీల్ కుమార్, డైరెక్టర్ కె. కుటుంబ రావు, కళాశాల NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ జయప్రద కళాశాల అధ్యాపకులు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్,విద్యార్థులు పాల్గొన్నారు.









