.
నవంబర్ 1 నుంచి 7 వరకు డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలి÷ డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్….
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
యువజనలు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ, దేశభక్తి ఎదురై దేశభక్తి కలిగిన సంఘంగా, దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా,యువజన ఉద్యమాల రథసారథిగా డివైఎఫ్ఐ ఉంది అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ అన్నారు…
స్థానిక సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ నాయకులు భూక్య ప్రసాద్ అధ్యక్షుడు జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటా రమేష్ మాట్లాడుతూ దేశంలో యువత పెడదారి పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ అమలు చేయకుండా యువతను మోసం చేస్తున్నాయని, దేశంలో యువ శక్తి నిర్వీర్యం అయిపోతుందని, ఇలాంటి సందర్భంలో యువతను సక్రమమైన మార్గంలో నడిపేందుకు డివైఎఫ్ఐ నడుంబించిందని ఆయన అన్నారు. ఏర్పడిన తర్వాత ఈ దేశం కోసం సంఘం కోసం అనేక మంది డివైఎఫ్ఐ నాయకులు ప్రాణాలు అర్పించారని , వారి త్యాగాలతో డివైఎఫ్ఐ ఈరోజు దేశంలో అతిపెద్ద యోజన సంఘం గా ముందుకు పోతుందని ఆయన అన్నారు. ఈ దేశంలో యువజన సంఘాలను ముందు నడిపించే రథసారధిగా డివైఎఫ్ఐ ఉందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ 1980లో పంజాబ్ ముత్యానాలో నవంబర్ ఒకటి, రెండు,మూడు తారీకుల్లో ఏర్పడిందని అందుకే నవంబర్ 1 2 3 తారీకు లో రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ కార్యక్రమాల ఘనంగా నిర్వహించాలని అని పిలుపునిచ్చారు. మా దేహం మొక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానీవని దేశ సమగ్రత, ఐక్యత కోసం పని చేసిన సంఘం డివైఎఫ్ఐ అన్నారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన మరియు దేశంలో ఉన్న యువతకు సక్రమమైన మార్గంలో పెట్టడం కోసం డివైఎఫ్ఐ పనిచేస్తుందని ఆయన అన్నారు. దినోత్సవాలు గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు, జిల్లా నాయకులు షేక్ నాగుల్ పాషా, రావులపాటి నాగరాజు మెట్టెల సతీష్,మధు, కూచిపూడి నరేష్, సుందర్ రావు , వంకత్తుల ప్రతాప్, వినయ్, నాయకులు సైదులు, మాచర్ల రాజశేఖర్, గుడిపూడి అరవింద్, రాసాల నవీన్, ఎర్ర సాయి, వంశీ, తదితరులు పాల్గొన్నారు…









