పంట నష్ట పరిహారాన్ని చెల్లిచవలసిందిగా ఎర్రుపాలెం మండల బి.జె.పి నాయకుల డిమాండ్
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 30/10/2025
గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన ఎర్రుపాలెం మండలంలో ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. పత్తి పంట గాని, వరి గాని, మిర్చి తోటలు గాని, భారీ నష్టం జరిగినది. అది గమనించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి పంట నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ను మేము డిమాండ్ చేస్తూ మరియు అదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర స్కీం లోకి జాయిన్ అయ్యి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ పంట నష్టాన్ని ప్రత్యేకమైన బృందంతో అంచనా వేయించి, అటు పత్తి, మిర్చి మరియు వరి పొలాలు అంచనా వేయించి వారికి పంట నష్టాన్ని తక్షణమే చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ని మండలం లో ఉన్నటువంటి అన్నిటిని, నష్టం జరిగిన పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని చెల్లించాల్సిందిగా బిజెపి మండల కన్వీనర్ దేవరకొండ కోటేశ్వరరావు డిమాండ్ చేసినారు.









