నేటి గదర్ కరకగూడెం:మండలంలోని అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారి శివకుమార్,కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ పక్క సమాచారం మేరకు కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ గ్రామంలోని పౌల్ట్రీ ఫారానికి బియ్యం తరలిస్తున్నారు అని పూర్తి సమాచారం మేరకు అక్కడికి చేరుకోని ట్రాక్టర్ లో ఉన్న 20 క్వింటాల బియ్యాన్ని పట్టుకోని సీజ్ చేసి,అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
Post Views: 83









