*దళారులు దండుకుంటున్న అధికారులు స్పందించరా*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జరిగే భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని గుండాల మాజీ సర్పంచ్ న్యూ డెమోక్రసీ నాయకులు కోరం సీతారాములు పిలుపునిచ్చారు. నవంబర్ ఒకటో తారీఖున మండల కేంద్రంలో భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నామని అన్నారు మొక్కజొన్న పంటకు కింటాకు 2928 మద్దతు ధర ఇవ్వాలని కానీ ప్రభుత్వం 2400 ప్రకటించిందని దీనికి నిరసనగా భారీ ప్రదర్శన చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే మొక్కజొన్నలు వచ్చి నెల రోజులు గడుస్తున్న దళారులు మొక్కజొన్నని తక్కువకు దండుకుంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. పర్మిషన్ లేని చిల్లర కౌంటర్లను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు
Post Views: 85









