సీపీఎం నేత దారుణ హత్య – మాజీ ఎంపీ నామ ఖండన.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్యకు గురికావడం పట్ల బిఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.
ప్రశాంతంగా ఉంటున్న ఖమ్మం లో హత్య రాజకీయాలు సరికావు అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు సహజం కాని, వాటిని హింసతో ఎదుర్కోవడం ప్రమాదకరం అని నామ పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన దోషులను త్వరితగతిన పట్టుకొని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. రామారావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు నామ నాగేశ్వరరావు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.









