మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన: పోలీస్ కమిషనర్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ అమరవీరులో వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నేలకొండపల్లి మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 1,500 మందిపైగా దాతల నుంచి రక్తం సేకరించారు.. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారని, ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. తలసేమియా రోగులకు ప్రతి15 రోజులకు ఒకసారి రక్తం అవసరం అవుతుందని, అందు కోసమే అమరవీరుల త్యాగాలకు నివాళిగా ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాట చేసినట్లు తెలిపారు.ఈ శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ఖమ్మం రూరల్, ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిఐ లు మురళి, రాజు, సంజీవ్,సాగర్, ఎస్ ఐ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.









