+91 95819 05907

భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరుల ఆశయాలు సాధిద్దాం

భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరుల ఆశయాలు సాధిద్దాం

★సిపిఐ ఎంఎల్ (ప్రజా పంథా) మాస్ లైన్

భారత విప్లవోద్యమంలో భూమి ,భుక్తి, విముక్తికై ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయాల వెలుగులో ప్రయాణించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు *నాయిని రాజు* సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా,డివిజన్ నాయకులు *బుర్ర వెంకన్న, అజ్మీర బిచ్చ,* పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు *కాంపాటి పృథ్వీ* అన్నారు. కొమరారం గ్రామంలో శనివారం *సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా)* *కొమరారం గ్రామ కమిటీ* ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న స్థూపాల వద్ద ఎర్రజెండాలను ఎగురవేసి కొమరారం గ్రామంలో అమరులైన పోట్ల కృష్ణమూర్తి,చుంచు వెంకన్న, ఏనుగుల వెంకన్న,కాంపాటి చంద్రన్న, పూనెం బుచ్చయ్య,గుర్రం ఇజ్రాయిల్, గుడిపల్లి పుష్ప రాజ్, దేవన్న తో పాటు 50 మంది అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి *ఎలుగు శాంతారావు* అధ్యక్షత వహించగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 50 ఏళ్ల కాలంలో స్వంత జీవితాలను వదిలిపెట్టి కష్టాలు, కన్నీళ్లు భరిస్తూ జైలు, నిర్బంధాలను ఎదుర్కొని పీడత ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన విప్లవకారులను దొరలు ,భూస్వాములు, గుండాలు హతమార్చారని, పోలీసు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో వందలాదిమంది విప్లవ వీరులను పొట్టను పెట్టుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయాల ఆధీనంలో ఆయుధాలను ఎత్తిపెట్టి ఆత్మరక్షణ పోరాటం కొనసాగించిన కాచనపల్లి అమరవీరులు,ముస్మీ అమరవీరులు,గొందుగూడెంలో బత్తుల వెంకటేశ్వరరావు, చీకటి గండ్ల అడివిలో నీలం రామచంద్ర,జంపాల చంద్రశేఖర్ ప్రసాద్,దొరన్న లడాయి గడ్డలో ఎల్లన్న, రోళ్ళగడ్డలో లింగన్న,మురళి బక్కచింతలపల్లి లో గణేష్ వీసం బాటన్న,రాయల చంద్రశేఖర్,గుండాల చేతిలో బుర్ర వీరస్వామి,పాపన్న ధనుంజయ్,తుమ్మలపల్లి హనుమంతరావు,గుగ్గిళ్ళ వెంకటేశ్వర్లు, బిక్కు మియా చందా మంగయ్య,సింగ్ సత్యనారాయణ,బండారి శ్రీను, ఎర్రమళ్ళ ఎర్రయ్య, తుడం రామయ్య,ముక్తి భిక్షం, బాబు,వజ్జ వీరబ్రహ్మం,పొదెం నరసయ్య,పులుసు వెంకన్న అసువులు బాసారని తెలిపారు. ఆదివాసి, దళిత పీడిత వర్గాలను చైతన్యం చేసేందుకు కళారంగానికి అంకితమై తమ రక్తాన్ని రంగరించి కళా నైపుణ్యంతో అక్షర యుద్ధాన్ని చేసిన ఏనుగుల వెంకన్న,కాంపాటి చంద్రం,కోడి శ్రీరాములు స్ఫూర్తితో కళాకారులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. గండి యాదన్న, ముక్తార్ పాషా చింతా పంతులు,పాయం లక్ష్మయ్య,జలీల్ పాషా, ఈసం భద్రన్న,చీమల నరసయ్య, బొర్ర ముత్తయ్య,ఎల్. విశ్వనాథం,ఏనుగుల రాంబాబు,జడ మల్లయ్య సంతోష్(మొండితోగు) వర్స సూరన్న,పెద్ద బోయిన వెంకన్న, కొండ కాశీం,లాంటి అనేకమంది విప్లవకారులు విప్లవాన్ని ఆకాంక్షించి విప్లవ బాటలో ప్రయాణించి అమరత్వం పొందారని తెలిపారు. విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరుల ఆశయాల బాటలో ప్రయాణించి ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల, ప్రాంతీయ కమిటీ, కొమరారం గ్రామ కమిటీ నాయకులు బుర్ర రాఘవులు బుర్ర లక్ష్మయ్య చందావత్ బాలు చొప్పదంటి రాములు కాంపాటి జగ్గులు భూక్య పాషా అజ్మీర రాంజీ బాదావత్ రమేష్ సీతాఫలం చార్లెస్ బుర్రి పద్మ కోరం ముతక్కా యమున కాంపాటి ఎలేందర్ కాంపాటి మహేష్ మోడెం తిరుపతి, ముద్దు శెట్టి నరసింహారావు, గుగులోత్ తీసుకెళ్తామని ఒప్పుకున్నారు ఈరు బానోతు అశోక్ కుంజ సమ్మన్న, పల్లె రాములు, అలవాల కోటేష్, గుగులోతు ఫులియా, గుగులోతు శ్రీను (డి.ఎస్.పి) చిట్టి బద్రు, కాంపాటి సందీప్, పసుపులేటి సతీష్ కాంపాటి రాములు, ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !