అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి( భూపాల్ మాదిగ) నవంబర్ 1.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ, ఆంజనేయ నవగ్రహ సహిత శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పదో వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం గణపతి పూజ, పుణ్యా వచనం, అఖండ దీపారాధన, హోమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి 108 కళశాలతో ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Post Views: 129









