*మాస్ లైన్ జిల్లా నాయకులు మాచర్ల సత్యం*
*నేటి గదర్ న్యూస్ గుండాల*,అమరుల ఆశయ సాధన కోసం కృషి చేస్తామని మాస్ లైన్ జిల్లా నాయకులు మాచర్ల సత్యం అన్నారు. మండల కేంద్రంలోని మాస్ లైన్ ప్రజా పందా కార్యాలయం ముందు పార్టీ జెండా ఎగరవేసి అమరుల చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ఇచ్చేందుకు ఎందరో నాయకులు తమ విలువైన ఉద్యమానికి అంకితమిచ్చారని అన్నారు. పీడిత ప్రజల కుల వ్యవస్థ వివక్షత నిర్మూలనకై ఎంతో కృషిచేసిన అమరుల ను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. నవంబర్ ఒకటో తారీకు నుండి ఏడో తారీఖు వరకు గ్రామ గ్రామాన అమరుల వర్ధంతి సభలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న, చంద్రన్న, కృష్ణ, సింగన్న, రాంబాబు, కుమార్, లక్ష్మయ్య, జగన్, మంగయ్య, మోహన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు









