సామినేని రామారావు కుటుంబాన్ని పరామర్శించిన- బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.
నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఇటీవల రాష్ట్ర నాయకులు సిపిఎం మాజీ సర్పంచ్ సామినేని రామారావు ని అతి కిరాతకంగా దుండగులు హత్య చేయడం జరిగింది. చింతకాని బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి ద్వారా సమాచారం తెలుసుకున్న ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆదివారం సామినేని రామారావు కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని, సామినేని రామారావు ని హత్య చేసిన దుండగులను వెంటనే విచారణ జరిపి ఆ దుండగులకి చట్ట ప్రకారం తగిన శిక్ష పడాలని వారు మాట్లాడినారు. సామినేని రామారావు కుటుంబానికి ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో పాత్రలపాడు బూత్ అధ్యక్షులు బొర్రా శ్రీను, జిల్లా నాయకులు, మందడపు సుబ్బారావు,జిల్లా కార్యదర్శి రావిశెట్టి నాగేశ్వరరావు,మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు, దుద్దుకూరు కార్తీక్,నెల్లూరి బెనర్జీ,మండల ప్రధాన కార్యదర్శిలు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బక్క సత్తిమూర్తి, చింతాల కృష్ణ, సీనియర్ నాయకులు మద్దినేని వెంకటేశ్వర్లు,అనగాని రామారావు, చెన్నూరి నాగచారి, కొండ ఎంకన్న, వేముల ఎల్లయ్య, సిద్ధార్థ,రావులపల్లి కృష్ణా తదితరులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.









