+91 95819 05907

మణుగూరు దాడిపై దమ్మపేట బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం -నిరసనకారులను అదుపులోకి తీసుకున్న దమ్మపేట పోలీసులు

మణుగూరు దాడిపై దమ్మపేట బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం -నిరసనకారులను అదుపులోకి తీసుకున్న దమ్మపేట పోలీసులు

మాజీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నిరసన చేపట్టిన బిఆర్ఎస్ శ్రేణులు -మందలపల్లి నుండి పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు దమ్మపేట మండలంలో బిఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మణుగూరులో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకుల అరాచక వైఖరిని నిరసిస్తూ, దమ్మపేట మండలం మందలపల్లిలో బి.ఆర్.ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. నిరసన ఉధృతం అవుతున్న తరుణంలో, శాంతిభద్రతల దృష్ట్యా దమ్మపేట పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని, వారిని దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో బిఆర్ఎస్ స్థానిక నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ప్రశ్నించే హక్కు లేకుండా బిఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అన్నారు. జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు పోరాటాన్ని తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బి.ఆర్.ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే, భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !