** హత్య రాజకీయాలు చేసేది సిపిఎం
** ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది కాంగ్రెస్
** భట్టి విక్రమార్క పై ఆరోపణలు సిపిఎం విజ్ఞతకే వదిలేస్తున్నాం
*** కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
సిపిఎం నాయకులకు మతిభ్రమించి డిప్యూటీ సీఎం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రం చింతకానిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు సామినేని రామారావు హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది అన్నారు. స్పందించిన డిప్యూటీ సీఎం హత్య చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారన్నారు. హత్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ దూరమని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలియజేశారు. హత్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు గోకినపల్లి తెల్దారుపల్లి గ్రామాల్లో జరిగిన ఘటనలే నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ, పథకాలకు ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే జీర్ణించుకోలేక సిపిఎం కాంగ్రెస్ పార్టీపై హత్య రాజకీయాల ముద్ర వేయడం ఏమిటని ప్రశ్నించారు. సిపిఎం పార్టీ ఆరోపించినట్లు కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు చేయదని కాంగ్రెస్ పార్టీపై హత్య రాజకీయాలు ఆరోపించిన గ్రామాల్లో భట్టి విక్రమార్కకు బ్రహ్మరథం పట్టి గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో అధిక మెజార్టీ వచ్చింది తెలియజేశారు. పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని పోలీసు ఉన్నతాధికారులు త్వరలోనే హత్య మిస్టరీని ఛేదిస్తారని స్పష్టం చేశారు. సామినేని రామారావును హత్యగావించిన నిందితులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. సీనియర్ నాయకులు హత్య గావించబడినప్పుడు సమన్వయంతో ఉండాలి కానీ రాజకీయ ప్రాబల్యం కోసం ఇతర పార్టీలపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం పార్టీని ప్రశ్నించారు. అభివృద్ధి ప్రదాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హత్య రాజకీయాలను సహించడని సుస్పష్టం చేశారు. ఇప్పటికైనా సిపిఎం కాంగ్రెస్ పార్టీపై నిరాదరణమైన ఆరోపణలు, నిందారోపణలు, అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య మండల నాయకులు కొప్పుల గోవిందరావు కన్యబోయిన గోపి, కూరపాటి కిషోర్, బందెల నాగార్జున, చట్టు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జ్ ఓర్సు వీరభద్రం, ఎస్.కె అబ్దుల్ మజీద్ పాషా, ఎస్కే కాసిం, దేశపోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.









