+91 95819 05907

కాంగ్రెస్ అరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోయింది- కమల్ రాజు, సండ్ర వెంకటవీరయ్య

కాంగ్రెస్ అరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోయింది- కమల్ రాజు, సండ్ర వెంకటవీరయ్య

సామినేని రామారావు హత్య పక్క దారి పట్టించే కుట్ర జరుగుతుంది

కేవలం మధిర నియోజకవర్గంలోనే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి..? భట్టి సమాధానం చెప్పాలి

హత్య జరిగి మూడు రోజులైన నిందితులను ఎందుకు పట్టుకోలేదు..?

చింతకాని మండలం పాతర్లపాడు ప్రెస్మీట్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,లింగాల కమల్ రాజు,సిపిఎం నేతలు మడుపల్లి గోపాల్ రావు,మాధినేని రమేష్..

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:

సిపిఎం సీనియర్ నేత,మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య చాలా దారుణమని బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఖండించారు.సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల ఆరాచకాలు పెరిగిపోయాయని,ఎవరి అండతో హత్యలు జరుగుతున్నాయని ప్రశ్నించారు.హత్య రాజకీయాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామినేని రామారావు హత్యను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందని వారన్నారు. విచారణ పేరుతో రామారావు కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని అది సరైంది కాదని వారు అన్నారు.మధిర నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ హత్య రాజకీయాలు చేస్తుంది తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు అధికార పార్టీ ఒత్తిడికి లొంగకుండ,నిష్పక్షపాతంగా విచారణ జరిపి కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మాదినేని రమేష్, వత్సవాయి జానకి రామయ్య,బిఆర్ఎస్ మండల కార్యదర్శి వెంకట రామయ్య, సీపీఎం మండల కార్యదర్శి రచాబంటి రాము, నాయకుల కొల్లి బాబు,సామినేని అప్పారావు,వెంకటేశ్వర్లు, పానకాల రావు,వేముల నర్సయ్య, చావ హనుమంత్ రావు, కోపూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !