+91 95819 05907

అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా.ఇదేనా ప్రజా పాలన?

*కాంగ్రెస్ నాయకులకు పై విరుచుక్కపడ్డ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు భాస్కర్*
*నేటి గదర్ న్యూస్ గుండాల*,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్వాన పరిస్థితులపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా వ్యవహరించి దాడులకు దిగటం ఎంతవరకు సమంజసం అని గుండాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు డిజిటల్ మీడియా ద్వారా రహదారుల పరిస్థితి పై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ మణుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసి కాలబెట్టడం ఎంతవరకు సరైంది అని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక అడిగే వారి పైన వారి పార్టీ కార్యాలయాల పైన దాడులకు దిగితే పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారు అనుకోవడం వారి అవివేకమని అన్నారు. అభివృద్ధి చేతకాక అడిగే వారిపై దాడులు చేయడమే మీ సంస్కృతి ఇదే మీ ప్రజా పాలన అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకలేక ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త రకం నాటకం తెరలేపిందని అన్నారు . ఈ దారిలో పాల్గొన్న కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి సారించి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని లేని పక్షంలో మరింతగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా ముందుకు కదులుతాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగటం మానుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా వెళ్లి వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగమ అధ్యక్షుడు సయ్యద్ అజ్జు,బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు,పార్టీ నాయకులు గడ్డం వీరన్న, కటికం నాగేశ్వరరావు, జాడి ప్రభాకర్, గోగ్గల రాంబాబు,పొంబోయిన సుధాకర్, బొమ్మెర్ల శ్రీను, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర సతీష్, గంగాధరి ప్రమోద్, జనగం లాలయ్య, భూక్య శ్రీను, ఆగయ్య, గంగాధరి నాగన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !