వనజీవి రామయ్య.. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఎంపీ రఘురాం రెడ్డికి ఆహ్వానం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
హైదరాబాద్:పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి రావలసిందిగా కోరుతూ..ఆ చిత్రం బాధ్యులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డిని ఆహ్వానించారు. చిత్ర దర్శకులు వేముగంటి, ఖమ్మం నగరానికి చెందిన ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ బల్లేపల్లి మోహన్ మంగళవారం హైదరాబాద్ లోని ఎంపీ నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 21వ తేదీన బల్లేపల్లి లోని నేచర్ వ్యాలీలో జరిగే షూటింగ్ ఆరంభ వేడుకకు తప్పక హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది మొక్కలు నాటి, వాటి సంరక్షణకు జీవితాన్ని అంకితమిచ్చిన గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా సినిమా అంటే.. భావితరాలకు స్ఫూర్తి నింపేలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.









