+91 95819 05907

సామినేని రామారావు కుటుంబానికి మాజీ ఎంపీ నామ పరామర్శ

నేటి గదర్ న్యూస్ , చింతకాని:

ఇటీవల దారుణ హత్యకు గురైన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్‌, సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా పరామర్శించారు. బుధవారం నాడు మండల బీ.ఆర్.యస్ పార్టీ నాయకులు మంకెన రమేష్, వంకాయలపాటి లచ్చయ్య, గురిజాల హనుమంతరావు, బొడ్డు వెంకట్రామయ్య, సామినేని అప్పారావు, పాపిటి రంగారావు, సామినేని బాబురావు, గడ్డం శ్రీనివాసరావు, వేముల నర్సయ్య తదితరులు రామారావు నివాసానికి వెళ్లిన సందర్భంలో అక్కడ నుండి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కు ఫోన్ చేసి రామారావు కుమారుడు సామినేని విజయ్‌తో మాట్లాడించారు. మాజీ ఎంపీ నామ వారితో మాట్లాడుతూ జరిగిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, కుటుంబ సభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. రామారావు వంటి సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోవడం అటు పార్టీకి, ప్రజా ఉద్యమానికి పెద్ద నష్టం అని అన్నారు. తనతో ఫోన్‌లో మాట్లాడిన రామారావు కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కల్పించారు. రామారావు హత్యను నామ తీవ్రంగా ఖండిస్తూ, దోషులను త్వరితగతిన పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు.ప్రజా నాయకులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని నామ ఆకాంక్షించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !