గుమ్మడవెల్లికి చెందిన ట్రాక్టర్ -అసివారిగూడెం వాసి మడివి వరుణ్ మృతి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 5: అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన బత్తుల రాకేష్ బత్తుల నాగేశ్వరరావు కుమారుడు ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను నడుపుతూ అశ్వారావుపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని రాకేష్ నడుపుతున్న ట్రాక్టరు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు, ద్విచక్ర వాహనం నడుపుతున్న అసివారిగూడెం గ్రామానికి చెందిన యువకుడు మాడివి వరుణ్ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు మరియు బంధువులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో అశ్వారావుపేట ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.









