+91 95819 05907

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు క్లబ్‌లో సినీ ప్రముఖులు, సినీ కార్మిక నాయకులతో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు క్లబ్‌లో సినీ ప్రముఖులు, సినీ కార్మిక నాయకులతో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ—

రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని తెలిపారు.

సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

చెన్నై నుంచి సినీ రంగాన్ని హైదరాబాద్‌కు రప్పించి, స్టూడియోలకు భూములు ఇచ్చి అభివృద్ధికి దోహదం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

ఫిలిం క్లబ్, చిత్రపురి కాలనీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాల దూరదృష్టి ఫలితమని అన్నారు.

సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో అన్ని భాషల వారూ కలసి ఎదుగుతున్నారని, భవిష్యత్తులో చిన్న, పెద్ద సినిమాలు మరింతగా రావాలని ఆకాంక్షించారు.

సినీ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ మరింత బలపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !