+91 95819 05907

మోదుగు గోవిందరావుకు CPI(M) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పరామర్శ

మోదుగు గోవిందరావుకు CPI(M) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పరామర్శ

నేటి గదర్ న్యూస్, వైరా:
సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద ప్రజానాట్యమండలి కళాకారుడు మోదుగు గోవిందరావును పరామర్శించారు. వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన మోదుగు గోవిందరావుకు ఇటీవల కాలంలో ఖమ్మం నుండి వస్తున్న సమయంలో వైరా అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి చేతులు, కాళ్లకు తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆపరేషన్ అనంతరం ఇంటివద్ద వైద్య చికిత్స పొందుతున్నారు. బుధవారం సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాలడుగు గ్రామంలోని మోదుగు గోవిందరావు ఇంటికి వచ్చి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్, వైరా మండల కమిటీ సభ్యులు బాజోజి రమణ, పాలడుగు గ్రామ శాఖ కార్యదర్శి షేక్ మజీద్ బి, షేక్ రేహాన, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !