నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న డి.ఇ నంబూరి రామారావు మాట్లాడుతూ రైతులు కెపాసిటర్ ను ఉపయోగించుకోవాలని, విద్యుత్తును పొదుపు చేయటంతో పాటు హై వోల్టేజ్, లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని ఆయన సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడైతే రైతులకు విద్యుత్ సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే అదనపు నియంత్రికలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తు లైన్లో కింద ఎత్తుగా ఉన్న చెట్లను పెంచడం వలన గాలి, దుమారాలు వచ్చినప్పుడు తోటి రైతులకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు .కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈలు ఉమామహేశ్వరి , చావా శ్రీధర్, సబ్ ఇంజనీర్ సందీప్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్
సుధా శ్రీనివాసరావు,
విద్యుత్ సిబ్బంది రమేష్ బాబు, కిషోర్, రైతులు అంబటి శాంతయ్య, అంబటి వెంకటి, అనగాని మంగయ్య ,నెల్లూరి రమేష్, అనేగాని ఎల్లయ్య ,గింజుపల్లి బాలకృష్ణ, కందిమల్ల రామారావు, నెల్లూరి సీతారామయ్య, బైరు వెంకటేశ్వర్లు, కూచిపూడి రామారావు, అనగాని సైదులు , కందిమల్ల రవి, కందిమల్ల వెంకటి ,
కందిమల్ల లక్ష్మణ్ ,పెంటయ్య,
మంద స్వామి , మంద బుజ్జి, మంద సాంబ,అనగాని రామయ్య, అనగాని కళ్యాణ్ ,కట్ట భరత్ తదితరులు పాల్గొన్నారు.









