అంగన్వాడి కేంద్రానికి కుర్చీలు వితరణ
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 07-11-2025
ఎర్రుపాలెం మండలం లోని బనిగండ్లపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు గల అంగన్వాడీ కేంద్రంలో కీర్తిశేషులు బలుసు పాటి ఆశీర్వాదం మాజీ ఎంపీటీసీ జ్ఞాపకార్థం సందర్భంగా ఆయన కుమారుడు బలుసుపాటి మాణిక్యరావు, మనుమడు పృద్వి చేతులు మీదుగా 3000 రూపాయలు విలువచేసే కుర్చీలను వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ కుర్చీలు వితరణగా ఇచ్చిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు పాఠశాలకు పెద్ద పెద్ద కాలేజీలకు చేస్తూ ఉంటారు కానీ పెద్ద మనసుతో మాజీ ఎంపీటీసీ కీర్తిశేషులు బలుసుపాటి ఆశీర్వాదం జ్ఞాపకార్థంతో అంగన్వాడి సెంటర్ కు ర్చీలు ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేశారు చిన్న పిల్లలకు సాయం చేసిన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.









