+91 95819 05907

దద్దరిల్లిన అశ్వారావుపేట -ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్‌ఎస్‌ నాయకులు -అభివృద్ధి గాలికి వదిలేసిన కాంగ్రెస్‌పై మెచ్చా నాగేశ్వరరావు ఉగ్రరూపం!

దద్దరిల్లిన అశ్వారావుపేట -ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్‌ఎస్‌ నాయకులు -అభివృద్ధి గాలికి వదిలేసిన కాంగ్రెస్‌పై మెచ్చా నాగేశ్వరరావు ఉగ్రరూపం!

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట
నవంబర్, 07: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు పిలుపుమేరకు, శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఐదు మండలాల బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు నరకానికి మార్గాలుగా మారాయని, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, శాసనసభ్యులకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. డిఎంఎఫ్టి, సీఎస్ఆర్ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిలబడేవారు లేరని, కేవలం నిలబడే (సిట్/స్టాండ్) శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప కొత్తగా ఒక్క దారి కూడా వేయలేదని, వేయకపోగా గుంతలు పడ్డ రోడ్లకు సైతం మరమ్మతులు చేసే దిక్కు లేదని ఆరోపించారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో 23 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులు మంజూరు చేసి మొదలు పెడితే, రెండేళ్లు దాటినా ఆ పనులను పూర్తి చేయకపోవడంతో అశ్వారావుపేటలో నివసించే ప్రజలు, వ్యాపారస్తులు మరియు పట్టణానికి వచ్చే అనేకమంది నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాహనాలు వెళ్ళే క్రమంలో ఆ రాళ్ళు ఎగిరివచ్చి అద్దాలపై పడి పగిలే పరిస్థితి ఉన్నా కనీసం కన్నెత్తి చూసిన నాథుడు లేడని అన్నారు. గిరిజన గ్రామాల్లో మంచి నీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, చెత్త తరలించే బండి (ట్రాక్టర్) రావడం లేదని, దేవుడా అని వేడుకున్నా పట్టించుకోవడం లేదని మహిళలు రోడ్డెక్కి తమ బాధను నిరసన రూపంలో తెలియజేస్తున్నారని వివరించారు. నన్ను గెలిపించకపోయినా నాకే బాధ వేసి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరానని, కానీ గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి ఇంకెవరినో గెలిపించాలని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో శాసనసభ్యులు అందరూ హడావుడి చేయడం విచిత్రంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మణుగూరులో పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఏదైనా ఉంటే న్యాయస్థానం ద్వారా చూసుకోవాలి కానీ ఇలాంటి గూండా రాజకీయాలు (రౌడీ రాజకీయాలు) చేయడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రావాల్సిన నిధులు వచ్చే దాకా, నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులపై ఉన్న గుంతలను పూడ్చే వరకు, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంజూరై మొదలైన పనులను వెంటనే పూర్తి చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదని మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !