*న్యూ డెమోక్రసీ నాయకులు ముక్తి సత్యం, కోరం సీతారాములు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాడుదామని న్యూ డెమోక్రసీల్ల జిల్లా నాయకులు ముక్తి సత్యం, కోరం సీతారాములు అన్నారు. మండల కేంద్రంలోని బాటన్న , ఎస్.కె హాఙ్గర్ స్థూపాల వద్ద పార్టీ జెండా ఎగరవేసి వారికి నివాళులు అర్పించారు. మండలంలో అమరులు ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలను చేశారని అన్నారు చంద్ర పుల్లారెడ్డి చూపిన బాటలో నడుస్తూ ఎన్నో ఉద్యమాలలో పాల్గొని ఆయన ఆశయ సాధనను ముందుండి నడిపించారని అన్నారు. గుండాల మండలంలో వేల ఎకరాల పోడు భూమికోసం పోరాడిన ఘనత నాయకులకు దక్కుతుందని అన్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ఎందరో అసువులు భాషారని అన్నారు. అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం ప్రజలు ముందుకు సాగుతూ ఉద్యమాల్లో పాల్గొనాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నరేష్, పరిషిక రవి, వై వెంకన్న, గడ్డం లాలయ్య, ఈసం కృష్ణ, పెంటన్న, ఉపేందర్, ఎల్లన్న, లాలు, వెంకన్న, శ్రీను, తాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు









